AP: బాపట్ల జిల్లా, కారంచేడు మండలం కుంకలమర్రు సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో లక్ష్మయ్య (65), నాగేంద్ర (55) అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో స్పందించిన అధికారులు, క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం వెంటనే చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.