
మహిళపై లైంగిక దాడి యత్నం.. యువకుడిని తరిమికొట్టిన వీధి కుక్కలు (Video)
తమిళనాడులోని కోయంబత్తూరులో గురువారం తుడియలూరు రైల్వే వంతెన కింద రోడ్డు పక్కన నిద్రిస్తున్న మానసిక దివ్యాంగురాలైన మహిళపై భూపతి అనే యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. మహిళ కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న రెండు వీధి కుక్కలు యువకుడిపై దాడి చేసి, అతన్ని తరిమికొట్టాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు భూపతిని అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఉన్న నిందితుడిని కుక్కలు అడ్డుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




