YCP ఎంపీ మిథున్ రెడ్డిపై కేసు నమోదు

1చూసినవారు
YCP ఎంపీ మిథున్ రెడ్డిపై కేసు నమోదు
AP: అన్నమయ్య జిల్లా, పుంగనూరులో నిన్న నామినేషన్ కేంద్రం వద్ద జరిగిన ఘర్షణలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ గొడవలకు సంబంధించి మొత్తం మూడు కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గొడవల్లో పాల్గొన్న సుమారు 70 మందిని గుర్తించామని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్