AP: కడప జిల్లా పులివెందులలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా శనివారం తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల నేపథ్యంలో పోలీసులపై దాడులకు సంబంధించి 562 మంది YCP కార్యకర్తలపై ఆదివారం కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనను ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించి భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు, అన్నమయ్య జిల్లా పుంగనూరులో కూటమి, సీపీఐ, ఎస్డీపీఐ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, అక్కడ YCP నేతలు ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేయలేదు. ప్రస్తుతం నామినేషన్ల గడువు ముగిసింది.