AP: పులివెందులలో నిన్న జరిగిన ఘర్షణలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులపై దాడుల ఘటనను అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనలకు సంబంధించి 562 మంది
వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. పులివెందులలో ప్రస్తుతం పోలీసుల నిఘా కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.