ఏపీ ప్రభుత్వం పౌరులకు ఇంటి నుంచే ప్రభుత్వ సేవలను అందించేందుకు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరించింది. తాజాగా ఇందులో కుల ధృవీకరణ పత్రం (Caste Certificate) సదుపాయాన్ని చేర్చింది. ఇకపై ప్రజలు ఎమ్మార్వో, గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, 9552300009 నంబర్ ద్వారా వాట్సాప్‌లోనే సులభంగా సర్టిఫికెట్ పొందవచ్చు. రెవెన్యూ సేవల్లో ఆధార్ నంబర్ నమోదు చేసి, రూ.40 ఫీజు చెల్లిస్తే పిడిఎఫ్ రూపంలో ధృవీకరణ పత్రం అందుతుంది.