యువకుడిపై ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్ (వీడియో)

15చూసినవారు
AP: తిరుపతి జిల్లా నాగలాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఓ యువకుడిపై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. శివకుమార్ అనే యువకుడు తన తండ్రితో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. ఫ్యాన్ కింద కూర్చుండగా.. అది ఊడిపడింది. దాంతో శివకుమార్ చెవికి గాయమైంది. నాగలాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో శివకుమార్‌కు చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్