నేడు, రేపు ఏపీలో కేంద్ర బృందం పర్యటన

4చూసినవారు
నేడు, రేపు ఏపీలో కేంద్ర బృందం పర్యటన
ఏపీలో తుఫాను వల్ల జరిగిన నష్టాలను అంచనా వేయడానికి ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం సోమవారం రాష్ట్రానికి రానుంది. ఈ బృందం రెండు వర్గాలుగా విడిపోయి కోనసీమ, కాకినాడ, మరియు ఉభయగోదావరి జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి, నష్టాలను పరిశీలించనుంది. పర్యటనలో భాగంగా తుఫాను బాధితులతో నేరుగా మాట్లాడి వివరాలు సేకరించనున్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కూడా ఈ బృందం సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్