నేడు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం

34చూసినవారు
నేడు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం
AP: రాష్ట్ర ప్రజలకు అలర్ట్. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. నాగావళి నది తీరంలోని 53 గ్రామాలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్