AP: సీఎం చంద్రబాబుపై
వైసీపీ అధినేత వైఎస్
జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి మోసం చేశారని, ఇది సుప్రీంకోర్టు ద్వారా నిర్ధారణ అయిందని
జగన్ ఆరోపించారు. సూపర్ సిక్స్ పేరుతో చేసిన మోసంతో పాటు, తమ ప్రభుత్వ పథకాలను రద్దు చేయడం మరో పెద్ద మోసమని ఆయన అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పాలని
జగన్ ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు.