AP:
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్
జగన్ మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు క్రిమినల్ మెంటాలిటీ ఉందని, అలాంటి వ్యక్తి చేతిలో అధికారం ఉంటే ప్రజలకు, రాష్ట్రానికి భద్రత లేదని ఆయన విమర్శించారు.
టీడీపీ గూండాలకు పోలీసులంటే భయం లేదని, వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైఎస్
జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆయన వ్యక్తం చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.