AP: చంద్రబాబు విజన్ ఉన్న సీఎం అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కొనియాడారు. దావోస్‌లో పెట్టుబడులు పెట్టేందుకు స్థలం కోసం ఎవరూ చూడటం లేదని, చంద్రబాబును కలిసేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ‘రాబోయే 20-30 ఏళ్లలో ప్రపంచం ఎలా మారబోతోంది? అందుకు ప్రభుత్వాలు ఎలా సిద్ధం కావాలి? అనే అంశాలపై చంద్రబాబు విజన్‌ను తెలుసుకునేందుకు ప్రపంచ నేతలు, పెట్టుబడిదారులు ఆయనను కలవాలనుకుంటున్నారు. అదే చంద్రబాబు మోసుకొస్తున్న స్ఫూర్తి, దూరదృష్టి’ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.