హుటాహుటిన ఢిల్లీకి చంద్రబాబు, పవన్

445చూసినవారు
హుటాహుటిన ఢిల్లీకి చంద్రబాబు, పవన్
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీకి పయనం కానున్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు వారు ఈ పర్యటన చేపడుతున్నట్లు సమాచారం. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై చర్చించేందుకు ఎన్డీఏ నేతలను ప్రధాని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం లేదా రేపు ప్రధాని మోడీతో వీరు సమావేశమయ్యే అవకాశం ఉంది. గతంలో వీగిపోయిన ఈ కీలక బిల్లులను ఆమోదించేందుకు కేంద్రం వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్