AP: ప్రధాని మోడీ పిలుపు మేరకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై చర్చించేందుకు ఎన్డీఏ నేతలను ప్రధాని మోడీ ఢిల్లీకి ఆహ్వానించినట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం లేదా రేపు ప్రధాని మోడీ వీరితో సమావేశమయ్యే అవకాశం ఉంది. గతంలో వీగిపోయిన ఈ కీలక బిల్లులను ఆమోదింపజేసే వ్యూహాలపై, ప్రతిపక్షాల వైఖరిని ఎదుర్కోవడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.