ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘పల్లె పండగ 3.0’ కార్యక్రమం నేడు (మంగళవారం) నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ప్రారంభం కానుంది. వరికుంటపాడు మండలం రామాపురంలో మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా రూ.11,085 కోట్ల అంచనా వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు. గ్రామీణ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధితోపాటు పాడి రైతులకు ప్రోత్సాహం కల్పించే పనులు చేపట్టనున్నారు.