
పంజాగుట్టలో అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు (వీడియో)
హైదరాబాద్ పంజాగుట్టలో పెనుప్రమాదం తప్పింది. గురువారం బేగంపేట నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్న XUV 700 కారు లైఫ్స్టైల్ బిల్డింగ్ వద్ద అదుపుతప్పి పల్టీలు కొట్టి రోడ్డుపై బోల్తాపడింది. కారులో మహిళా డ్రైవర్ ఒక్కరే ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు కారులో నుంచి ఆమెను బయటకు తీశారు. ప్రమాద సమయంలో పక్కన ఇతర వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పంజాగుట్ట పోలీసులు ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు.




