AP:
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని శ్రీవాహిని కళాశాల కౌంటింగ్ కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో కరెంట్ కట్ కావడంతో కౌంటింగ్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై అభ్యర్థుల ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కాసేపు అక్కడ గందరగోళం నెలకొంది.