
రాబోయే రెండు మూడు రోజుల్లో తెలుగురాష్ట్రాల్లో వర్షాలు: వాతావరణ శాఖ
నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రభావంతో రాబోయే రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం వేళల్లో తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో పాటు సాయంత్రం వేళల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. హైదరాబాద్ సహా తెలంగాణ, రాయలసీమల్లో అక్కడక్కడా జల్లులు పడే అవకాశం ఉండగా, మిగతా చోట్ల పొడి వాతావరణం ఉంటుంది.




