Sep 12, 2026, 11:09 IST/
ధరణి పేరుతో బీఆర్ఎస్ భూదందా: మంత్రి పొంగులేటి (VIDEO)
Sep 12, 2026, 11:09 IST
TG: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని లక్షలాది ఎకరాల భూములను ఆక్రమించిందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం శాసనసభలో తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, కేసీఆర్ రెవెన్యూ శాఖను తన వద్దే ఉంచుకుని భూ అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. ధరణి పోర్టల్ నిర్వహణను ఒక విదేశీ కంపెనీకి అప్పగించి, అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు చేశారని, దీనివల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.