Sep 11, 2026, 17:09 IST/ధర్మపురి
ధర్మపురి
పోషణ మాసం: గర్భిణీలు, చిన్నారులకు పౌష్టికాహారం తప్పనిసరి - వేముల నాగలక్ష్మి
Sep 11, 2026, 17:09 IST
ధర్మపురిలో తెలంగాణ ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పోషణ అభియాన్ – పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడం, ముఖ్యంగా 3 సంవత్సరాలలోపు పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం అంగన్వాడీ కేంద్రాల లక్ష్యమని తెలిపారు.