
దామలచెరువులో ఎస్ఎంసీ నూతన కమిటీ ఎన్నిక
దామల చెరువులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (యస్. యం. సి) ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో పొలిశెట్టిగారిపల్లికి చెందిన చెరుకూరి రమేష్ చైర్మన్గా దామల చెరువుకు చెందిన నబీనా వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం ప్రధానోపాధ్యాయురాలు సుమతమ్మ సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు.































