
చిత్తూరులో ఉత్సాహంగా జిల్లా యువజనోత్సవాలు
చిత్తూరులోని విజయమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బుధవారం జిల్లా యువజనోత్సవాలు–2026 అట్టహాసంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా 150 మంది యువతీ యువకులు జానపద నృత్యం, గీతాలు, వీధి నాటకం, చిత్రలేఖనం, కవితా రచన వంటి పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ యువత కళలు, క్రీడలు, విద్యతో పాటు సామాజిక బాధ్యతలోనూ ముందుండాలని సూచించారు. విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో చిత్తూరు జిల్లా తరఫున ప్రథమ స్థానంలో నిలిచినవారు పాల్గొంటారు.





































