Oct 10, 2026, 08:10 IST/
ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు.. బాలిక ఆత్మహత్య
Oct 10, 2026, 08:10 IST
TG: వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని రావులపల్లి గ్రామంలో ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు భరించలేక ఓ మైనర్ బాలిక వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం సాయంత్రం యువకుడు పదే పదే ఫోన్ చేసి వేధించడంతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురై ఊరి శివారులోని వ్యవసాయ బావిలో దూకింది. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, నిందితుడు చరణ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.