Sep 09, 2026, 14:09 IST/
చిన్న వ్యాపారులకు అమెజాన్ పే-కోటక్ క్రెడిట్ కార్డ్!
Sep 09, 2026, 14:09 IST
చిన్న వ్యాపారుల రుణ అవసరాలు తీర్చేందుకు అమెజాన్ పే, కోటక్ మహీంద్రా బ్యాంక్ సంయుక్తంగా 'అమెజాన్ పే కోటక్ బిజినెస్ క్రెడిట్ కార్డు'ను లాంచ్ చేశాయి. ఈ కార్డు ద్వారా కొనుగోళ్లపై 5% వరకు, బిల్లులు-రీఛార్జ్లపై 2% క్యాష్బ్యాక్ లభిస్తుంది. అలాగే 48 రోజుల వడ్డీ రహిత క్రెడిట్ కాల పరిమితి, నో-కాస్ట్ EMI వెసులుబాటు కల్పించారు. దేశ GDPలో 30% వాటా ఉన్న MSME రంగానికి సులభంగా క్రెడిట్ అందించి, వ్యాపార నగదు ప్రవాహాలను మెరుగ్గా నిర్వహించుకునేందుకు ఈ కార్డు తోడ్పడనుంది.