
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
శ్రీరంగరాజపురం మండలం ఆరిమాకులపల్లిలో శేఖర్ (32) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 16న వినాయక నిమజ్జనానికి వెళ్లి వచ్చిన శేఖర్, అనారోగ్యంతో బాధపడుతూ అక్టోబర్ 24న మృతి చెందాడు. అతని తల్లి యశోదమ్మ, కొందరు వ్యక్తులు దాడి చేసి గాయపరచడం వల్లే మృతి చెందాడని గ్రామస్తుల ద్వారా తెలుసుకొని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. దర్యాప్తులో లభించిన ఆధారాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.






















