Sep 17, 2026, 17:09 IST/ధర్మపురి
ధర్మపురి
విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న చైర్ పర్సన్ నాగలక్ష్మి
Sep 17, 2026, 17:09 IST
ధర్మపురి పట్టణంలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో గురువారం విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ వేములనాగలక్ష్మి పాల్గొన్నారు. ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి, విశ్వకర్మ సామాజిక వర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం ధర్మపురి పట్టణ అధ్యక్షుడు సింహారాజు ప్రసాద్, సంఘ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.