కలకాడ మండలం - Kalakada Mandal

జగిత్యాల జిల్లా
Sep 11, 2026, 15:09 IST/

సెల్‌ఫోన్ కోసం బావిలోకి దిగిన ఇద్దరు మృతి!

Sep 11, 2026, 15:09 IST
తిరుపతి అలిపిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎస్‌బీఐ ట్రైనింగ్ సెంటర్ వెనుక ఉన్న బావిలో సెల్‌ఫోన్ కోసం దిగిన ఇద్దరు వలస కూలీలు మృతి చెందారు. ఒడిశాకు చెందిన భీమ్‌రాజ్ (36), నరేష్ (21)గా మృతులను గుర్తించారు. బావిలో పడిన సెల్‌ఫోన్ కోసం భీమ్‌రాజ్ దిగగా, అతడిని కాపాడేందుకు నరేష్ కూడా బావిలోకి దిగినట్లు పోలీసులు తెలిపారు. బావిలో విషవాయువులు పీల్చుకోవడంతో ఇద్దరూ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. అలిపిరి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మృతదేహాలను వెలికితీసి, రుయా ఆస్పత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.