
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం అవసరం.. నాయుడు
కుప్పం, శాంతిపురం మండలం శివరాంపురం పంచాయతీ కొలమడుగు హైస్కూల్ నందు మంగళవారం ఎస్ఎంసి ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఈ సందర్భంగా స్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ విశ్వనాథ్ నాయుడు, శివరాంపురం పంచాయతీ యూనిట్ ఇంచార్జ్ శేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతోనే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కూటమి ప్రభుత్వంలో సాధ్యమని తెలిపారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఆనంద్ రెడ్డి, సూరి, ప్రకాష్, మహిళా అధ్యక్షురాలు హేమావతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శామలమ్మ పాల్గొన్నారు.






































