కుప్పం మండలం - Kuppam Mandal

జగిత్యాల జిల్లా
2100 నాటికి మానవాళి అంతం?
Oct 12, 2026, 16:10 IST/

2100 నాటికి మానవాళి అంతం?

Oct 12, 2026, 16:10 IST
కృత్రిమ మేధ (ఏఐ) దుర్వినియోగంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఏఐని ఉపయోగించి జీవాయుధాలను రూపొందించడం మానవాళి మనుగడకే ముప్పు తెస్తుందని లాన్సెట్ కమిషన్ నివేదిక హెచ్చరించింది. 35 మంది నిపుణులు ఈ పరిశోధనా ఫలితాలను జర్మనీలో జరిగే ప్రపంచ ఆరోగ్య సదస్సులో ప్రదర్శించనున్నారు. అణుయుద్ధం జరిగితే ప్రపంచవ్యాప్తంగా కరువు, ఆహార కొరత ఏర్పడి కోట్లాది మంది ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది. అణుయుద్ధం, ఏఐ దుర్వినియోగంతో పాటు వాయు కాలుష్యం, వాతావరణ మార్పులు, యాంటీబయాటిక్‌ రెసిస్టెన్స్, పోషకాహార లోపం, మహమ్మారులు, ఊబకాయం వంటి 15 ప్రధాన ముప్పులను కూడా లాన్సెట్ గుర్తించింది.