మదనపల్లె - Madanapalle

వీడియోలు


జగిత్యాల జిల్లా
జగిత్యాల: వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
Sep 22, 2026, 17:09 IST/జగిత్యాల
జగిత్యాల

జగిత్యాల: వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

Sep 22, 2026, 17:09 IST
జగిత్యాల జిల్లాలో వినాయక నిమజ్జనానికి సంబంధించి చింతకుంట చెరువు వద్ద చేపట్టిన ఏర్పాట్లను మంగళవారం మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, ఆర్డీఓ మధుసూదన్ పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు, రాకపోకలు, క్రేన్‌ల వంటి ఏర్పాట్లను పూర్తిస్థాయిలో చేపట్టాలని అధికారులకు సూచించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా మున్సిపాలిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోందని చైర్‌పర్సన్ తెలిపారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.