Sep 16, 2026, 15:09 IST/
భార్యపై అనుమానం.. నిద్రిస్తున్న భార్య తల నరికి చంపిన భర్త
Sep 16, 2026, 15:09 IST
ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో జరిగిన దారుణ హత్య ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. భార్య నగ్మా (28) మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని భర్త పర్వేజ్ అనుమానించాడు. ఈ విషయంపై తరచూ గొడవలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 9 రాత్రి నగ్మా నిద్రిస్తున్న సమయంలో పర్వేజ్ కత్తితో దాడి చేసి ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు పర్వేజ్ను అరెస్ట్ చేసి, నగ్మా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.