Oct 05, 2026, 17:10 IST/జగిత్యాల
జగిత్యాల
రైతుకు డ్రాగన్ ఫ్రూట్ తోటతో అధిక లాభాలు: అధికారి
Oct 05, 2026, 17:10 IST
జగిత్యాల జిల్లా రాయికల్ లో చందనగిరి మనోహర్ అనే రైతు రెండు ఎకరాల్లో సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ తోటను ఉద్యానవన విస్తరణాధికారి రాజేష్ నాయక్ సోమవారం సందర్శించారు. డ్రాగన్ ఫ్రూట్స్ సాగుతో రైతులకు అధిక లాభాలు వస్తాయని, ఈ రైతుకు మంచి ఆదాయం వచ్చిందని అధికారి తెలిపారు. ఉద్యానవన శాఖ ద్వారా ప్రభుత్వం అందించే సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.