
రామసముద్రం రోడ్డుకు రూ.4 కోట్లతో భూమిపూజ
చిత్తూరు జిల్లా పలమనేరులో పల్లె పండుగ 3.0లో భాగంగా రామసముద్రం రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లతో ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి భూమిపూజ బుధవారం నిర్వహించారు. దశాబ్దాల గ్రామస్థుల కల నెరవేరనుండటంతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.




































