Oct 15, 2026, 10:10 IST/
విదేశీ విద్యానిధి స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు
Oct 15, 2026, 10:10 IST
తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం దరఖాస్తు గడువును అక్టోబర్ 15 నుంచి OCT 31 వరకు పొడిగించింది. విదేశాల్లో మాస్టర్స్, డాక్టోరల్ చదువులు అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఈ పథకం ద్వారా రూ.20 లక్షల వరకు స్కాలర్షిప్ అందజేస్తున్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి. దరఖాస్తు చేసుకునే నాటికి వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి. గ్రాడ్యుయేషన్లో కనీసం 60% మార్కులతో పాటు GRE 260 లేదా GMAT 500, TOEFL 60 లేదా IELTS 6.0 లేదా PTE 50 స్కోర్ తప్పనిసరి. దరఖాస్తు, వివరాల కోసం https://telanganaepass.cgg.gov.in/OverseasLinks.do వెబ్సైట్లో చూడవచ్చు.