Sep 04, 2026, 16:09 IST/
ఏపీలో షాకింగ్ ఘటన.. ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిల ట్రాప్
Sep 04, 2026, 16:09 IST
AP: ఇళ్లు, తిండి లేకపోయినా లగ్జరీ ఫోటోలతో సోషల్ మీడియాలో బాలికలను లక్ష్యంగా చేసుకునే ముఠాలు పెరుగుతున్నాయి. గుంటూరులో మెకానిక్ జాన్ సైదా (21) ఒక బాలికను (15) ఇన్స్టాగ్రామ్లో ట్రాప్ చేశాడు. బాలిక ఇంట్లో నుంచి డబ్బు, బంగారం తీసుకుని 3 నెలల క్రితం పారిపోయారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయమూర్తి డీజీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు, వారి ఆచూకీని హరియాణాలో గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేశారు.