Sep 21, 2026, 13:09 IST/
సిలబస్ మార్పు అంశం.. TGPSC కీలక ప్రకటన
Sep 21, 2026, 13:09 IST
TG: ఉద్యోగ నియామక పోటీ పరీక్షల సిలబస్లో మార్పులపై వస్తున్న ఊహాగానాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తెరదించింది. తాము ఎలాంటి సిలబస్ కమిటీని ఏర్పాటు చేయలేదని, సిలబస్లో పెద్దగా మార్పులు ప్రతిపాదిస్తే ఏడాదికి ముందే తెలియజేస్తామని కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు విడుదల చేసిన వెబ్నోట్లో అభ్యర్థుల ఆందోళనలు, సందేహాలపై స్పందించింది.