
పీలేరులో ట్రాక్టర్ను ఢీకొన్న బైక్.. ఒకరు మృతి
అన్నమయ్య జిల్లా పీలేరులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎంజీఆర్ కాలేజ్ సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్ను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో పూతలపట్టుకు చెందిన మదనమోహన్ (35) అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన భార్యతో కలిసి పీలేరులో ఒక ఫంక్షన్కు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.





























