
తవణంపల్లి: పాఠశాల కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం
తవణంపల్లిలోని ఎగువ వెంకటాపురం ఎంపీపీ పాఠశాలలో రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు మంగళవారం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు చాముండేశ్వరి సమక్షంలో తల్లిదండ్రుల భాగస్వామ్యంతో జరిగిన ఈ ఎన్నికల్లో, నిబంధనల ప్రకారం చైర్మన్, వైస్ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్. మహేంద్ర ఎస్ఎంసీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని మహేంద్ర తెలిపారు.






















