Sep 18, 2026, 01:09 IST/
ఫోన్ EMI కట్టలేదని.. కిడ్నాప్ చేసి యువకుడి రక్తం అమ్మారు
Sep 18, 2026, 01:09 IST
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఫోన్ EMI కట్టలేదని నవల్కుమార్ అనే యువకుడిని కిడ్నాప్ చేసి, నాలుగు రోజుల పాటు హింసించి, అతని రక్తాన్ని బ్లడ్ బ్యాంక్లో అమ్ముకున్న దారుణ ఘటన వెలుగు చూసింది. బాధితుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు అనికేత్ సింగ్, సుశాంత్ శర్మ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. EMI కట్టనందుకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశ్యంతోనే ఈ కిడ్నాప్ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.