పుంగనూరు - Punganuru

చికిత్స పొందుతూ మహిళ మృతి

చికిత్స పొందుతూ మహిళ మృతి

పుంగనూరు మండలం నేతిగుట్లపల్లె పంచాయతీ దిగువకొండమీదపల్లెకు చెందిన మాధురి (27) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం పుట్టినిల్లు పెద్దపంజాణి మండలం ముత్తుకూరు నుంచి తన భర్త, ఇద్దరు కుమార్తెలతో కలిసి ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. మార్గమధ్యంలో తన ఏడాది పాపకు బైక్ దిగి పాలు ఇస్తుండగా వీరిపైకి కారు దూసుకొచ్చింది.  మాధురి, భర్త మురళి, కుమార్తె యశస్విని (1) గాయపడ్డారు. పుంగనూరులో ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మాధురి ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు.

వీడియోలు


జగిత్యాల జిల్లా
Top 10 viral news 🔥
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా ఒక్కొక్కరికి రూ.21,000ల బోనస్!
Sep 30, 2026, 17:09 IST/

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా ఒక్కొక్కరికి రూ.21,000ల బోనస్!

Sep 30, 2026, 17:09 IST
దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) పెంపుపై చర్చలు ఊపందుకున్నాయి. ఉద్యోగ సంఘాలు బోనస్ లెక్కింపు సీలింగ్‌ను రూ.7,000 నుండి రూ.21,000కి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, ఉద్యోగులకు రూ.20,724 వరకు అదనంగా లభించే అవకాశం ఉంది. అక్టోబర్ మొదటి వారంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే, కొన్ని విభాగాల్లో రోజులు తగ్గించి బోనస్ ఇవ్వడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.