పూతలపట్టు మండలం - Puthalapattu Mandal

జగిత్యాల జిల్లా
విద్యానగర్‌లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ప్రారంభం
Oct 10, 2026, 17:10 IST/కోరుట్ల
కోరుట్ల

విద్యానగర్‌లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ప్రారంభం

Oct 10, 2026, 17:10 IST
జగిత్యాలలోని విద్యానగర్‌లో గల్లీ కా గ్యాంగ్ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పండుగలో భాగంగా మొదటి రోజు మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పాటలు పాడుతూ, బతుకమ్మ చుట్టూ సంప్రదాయబద్ధంగా ఆడిపాడారు. ఈ కార్యక్రమాలు మహిళల మధ్య ఐక్యత, ఆత్మీయత, సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ప్రకృతిని, పూల అందాలను, మహిళల ఐక్యతను ప్రతిబింబించే ఈ పండుగను అందరూ కలిసి ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు.