రామకుప్పం మండలం - Ramakuppam Mandal

జగిత్యాల జిల్లా
మెట్‌పల్లి రైల్వే సమస్యలపై సంతకాల సేకరణ
Sep 28, 2026, 16:09 IST/కోరుట్ల
కోరుట్ల

మెట్‌పల్లి రైల్వే సమస్యలపై సంతకాల సేకరణ

Sep 28, 2026, 16:09 IST
మెట్‌పల్లి ప్రాంత ప్రజల రైల్వే సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సుఖీభవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బొక్కెనపల్లి నాగరాజ్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజల సంతకాలను సేకరించారు. హైదరాబాద్–కాజీపేట వయా కరీంనగర్ మార్గంలో ప్రతిరోజూ రైలు నడపాలని, కాచిగూడ–కరీంనగర్ మార్గంలో అదనపు రైళ్లను ఏర్పాటు చేయాలని, మెట్‌పల్లి మీదుగా నడిచే ప్రతి రైలుకు మెట్‌పల్లి స్టేషన్‌లో హాల్ట్ కల్పించాలని కోరుతూ సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని కేంద్ర రైల్వే మంత్రికి, దక్షిణ మధ్య రైల్వే జీఎంకు పోస్టు ద్వారా పంపించారు. మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల ప్రజలకు అవసరాల కోసం రాకపోకలు సాగించేందుకు మెరుగైన రైలు సౌకర్యాలు అవసరమని నాగరాజు కోరారు.