
పంచాయతీ అనుమతి లేకుండా చేపల పెంపకం: గ్రామస్తుల ఆందోళన
తిరుపతి జిల్లా, సత్యవేడు మండలం, తిరువత్యం గ్రామస్తులు పంచాయతీ పరిధిలో అనుమతి లేకుండా చేపల పెంపకం కొనసాగడంపై శనివారం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువుగట్టు పంచాయతీ పరిధిలోని ప్రాజెక్టులో 2023-24 సంవత్సరానికి చేపల పెంపకం వేలం పాటలో దక్కించుకున్న వ్యక్తి, కాలపరిమితి ఒక సంవత్సరం అయినా రెండేళ్లుగా చేపల పెంపకం, అమ్మకం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల పంచాయతీకి రావాల్సిన ఆదాయానికి గండి పడుతుందని గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు వాపోతున్నారు. అయితే, సంబంధిత వ్యక్తి నష్టపోయాడని, కాలపరిమితి పెంచి ఇచ్చామని గ్రామ పెద్దలు చెబుతున్నారు.


























