
రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
రేణిగుంట – తిరుచనూరు మధ్య మంగళవారం ఉదయం రైలు నుంచి జారిపడి సుమారు 37 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. మృతుడు ఆరెంజ్ షార్ట్, వైట్ టీ-షర్ట్ ధరించి, కుడిచేతిపై 'జై శ్రీరామ్' పచ్చబొట్టు కలిగి ఉన్నాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు జీఆర్పీ ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని 9247575621 నంబరులో సంప్రదించాలని కోరారు.



























