Sep 09, 2026, 01:09 IST/
నా భర్తే అంతా చూసుకున్నారు: యూట్యూబర్ నందన
Sep 09, 2026, 01:09 IST
AP: మోసం కేసులో యూట్యూబర్ నందనను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఆమెను విచారించారు. తన భర్త మధుకర్ కంపెనీ డైరెక్టర్ అని, అంతా ఆయనే చూసుకున్నారని నందన తెలిపినట్లు సమాచారం. వీసాలు తీసుకున్న వారు టైంకి వెళ్లకపోవడంతో క్యాన్సిల్ అయ్యాయని, డబ్బుల వ్యవహారం తన భర్త మధుకర్కే తెలుసంటూ దాటవేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 16న ఆమె మళ్లీ విచారణకు హాజరుకానుంది.