
మోడీ పాలనకు డప్పు కళాకారుల ప్రపంచ రికార్డు అంకితం
తిరుపతిలో 4 రోజులుగా జరిగిన ప్రధాని మోడీ పాలన 20 ఏళ్ల పాలన సందర్భంగా, తంబళ్లపల్లె డప్పు కళాకారులు ప్రదర్శించిన ప్రదర్శనలు ప్రశంసనీయమని రాష్ట్ర SC మోర్చా అధికార ప్రతినిధి పీట్ల అంజలి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా రికార్డును బ్రేక్ చేసిన డప్పు కళాకారులను SC మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్, భారతదేశ CEO సోలంకి, వరల్డ్ రికార్డ్ CEO పవన్ సోలంకి, ముఖ్య అతిథి బాబు మోహన్, TDPI బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, పురుషోత్తం అభినందించారు. CEO సోలంకి పీట్ల అంజలికి వరల్డ్ రికార్డు పత్రాన్ని అందజేశారు. ఈ ప్రపంచ రికార్డు మోడీకి అంకితం చేయబడింది.


































