Sep 26, 2026, 14:09 IST/
తల్లిదండ్రుల మధ్య గొడవ.. షాక్తో ఆరేళ్ల కుమార్తె మృతి
Sep 26, 2026, 14:09 IST
ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో విషాద ఘటన జరిగింది. చికెన్ వండే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న ప్రమోద్ గౌతమ్ భార్యను కొట్టడంతో.. ఆరేళ్ల కుమార్తె మహక్ తీవ్ర ఆందోళనకు గురై ఒక్కసారిగా కుప్పకూలింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలిక శరీరంపై గాయాల గుర్తులు లేవని పోలీసులు చెప్పారు. షాక్తోనే మృతి చెంది ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు.. పోస్ట్మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.