
చిత్తూరు కలెక్టర్‌కు వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ అభ్యర్థులపై జరుగుతున్న దాడులు, నామినేషన్ పత్రాల చింపివేత ఘటనలపై మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేగౌడ స్పందించారు. ఈ ఘటనలపై ఆయన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌ను గురువారం కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు.
































