
కుప్పంలో ఉద్రిక్తత..టీడీపీ కార్యకర్తపై బ్లేడ్లతో దాడి
కుప్పం శాంతిపురం మండలంలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ వేసే సమయంలో కోదిగుట్లపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై వైఎస్ఆర్సిపి నేతలు బ్లేడ్లతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తీవ్రంగా గాయపడిన సదరు కార్యకర్త ఆసుపత్రి పాలయ్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఘటనను ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నాయి.
































