
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు
నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు దసరా ఉత్సవాలలో భాగంగా తొలి రోజు శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారి అలంకరణ అనంతరం మహా హోమం మహిళలచే కుంకుమార్చన నిర్వహించి మధ్యాహ్న హారతి నైవేద్యం సమర్పించారు. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.

























